ఇవాళ జీవో ప్రతులను తగులబెట్టాడు.. రేపు రాజ్యాంగాన్ని కూడా తగులబెడతాడేమో!: చంద్రబాబుపై విజయసాయి విమర్శలు

  • వివాదాస్పదంగా మారిన జీవో నెం.1
  • జీవో ప్రతులను భోగి మంటల్లో వేసిన చంద్రబాబు
  • ప్రజాస్వామ్యాన్ని కించపర్చాడన్న విజయసాయిరెడ్డి
సంక్రాంతి వేడుకల కోసం స్వగ్రామం నారావారిపల్లె వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు వివాదాదస్పద జీవో నెం.1 ప్రతులను భోగిమంటల్లో వేయడం తెలిసిందే. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. 

ప్రజల చేత ఎన్నికైన ఓ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను తగులబెట్టడం అంటే భారతీయ చట్టం, ప్రజాస్వామ్యం పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించడమేనని పేర్కొన్నారు. ఇవాళ జీవో ప్రతులను తగులబెట్టాడు... రేపు రాజ్యాంగాన్ని తగులబెడతాడేమో! అంటూ విజయసాయి ట్వీట్ చేశారు. 

"గతంలో ఒకరు బహిరంగంగా ప్రభుత్వ పత్రాలను చించివేసినప్పుడు ప్రజలు ఏమనుకున్నారో అందరికీ తెలుసు. నియంత పోకడలు అంటే ఇవే" అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

Vijayasai Reddy
Chandrababu
G.O No.1
Bhogi
YSRCP
TDP

More Telugu News